మీ ఆస్తిని అద్దెకు లేదా అమ్మకానికి ఇవ్వాలనుకుంటున్నారా? లిస్టింగ్ ఎలా చేయాలో వివరంగా తెలుసుకోండి!
మీ ఇల్లు, షాపు, ల్యాండ్ లేదా అపార్ట్‌మెంట్‌ను అద్దెకు/అమ్మకానికి ఇవ్వాలనుకుంటున్నారా? లిస్టింగ్ చేసే విధానం ఇక్కడ తెలుసుకోండి!
వివరణాత్మక మార్గదర్శకం (User Guide):
మా వెబ్‌సైట్‌లో మీ ఇల్లు, షాపు, ల్యాండ్ లేదా అపార్ట్‌మెంట్ వివరాలను నమోదు చేయడం చాలా సులభం. కొత్తగా వచ్చేవారికి ఇబ్బంది లేకుండా, ఒక పద్ధతి ప్రకారం వివరాలు ఎలా నింపాలో ఇక్కడ చూడండి:
1. మొదటగా ‘స్టేటస్’ (Status) ఎంచుకోండి:
ముందుగా మీరు మీ ఆస్తిని “అద్దెకు” (For Rent) ఇవ్వాలనుకుంటున్నారా? లేదా “అమ్మకానికి” (For Sale) పెట్టాలనుకుంటున్నారా? అనేది ఎంచుకోండి. మీరు దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాతే ధర వివరాలు అడగడం జరుగుతుంది.
2. రకాన్ని (Type) ఎంచుకోండి – ఇది చాలా ముఖ్యం:
ఇక్కడ మీరు దేని గురించి వివరాలు ఇస్తున్నారో అది ఎంచుకోవాలి. మీరు ఎంచుకునే దానిని బట్టే కింద అడిగే ప్రశ్నలు మారుతాయి:
ఇల్లు లేదా అపార్ట్‌మెంట్: ఇవి ఎంచుకుంటే.. ఎన్ని గదులు (BHK), ఎన్ని బాత్‌రూమ్‌లు, లిఫ్ట్ ఉందా? వంటి ప్రశ్నలు వస్తాయి.
షాపు (Commercial): ఇది ఎంచుకుంటే.. అది ఏ వ్యాపారానికి సెట్ అవుతుంది, రోడ్డు ఫేసింగ్ ఉందా? వంటి ప్రశ్నలు వస్తాయి.
ల్యాండ్ లేదా ఖాళీ స్థలాలు: ఇవి ఎంచుకుంటే.. ఎన్ని గజాలు లేదా ఎన్ని ఎకరాలు, సర్వే నెంబర్ ఎంత? వంటి ప్రశ్నలు వస్తాయి.
గుర్తుంచుకోండి: మీరు రకాన్ని ఎంచుకోకుండా ముందుకు వెళితే వెబ్‌సైట్ వివరాలను తీసుకోదు.
3. ప్రాంతం మరియు చిరునామా (Location Details):
వెతికే వారికి మీ ప్రాంతం సులభంగా దొరకాలి అంటే ఈ వివరాలు కరెక్ట్‌గా ఇవ్వండి:
మీ జిల్లా, మండలం మరియు గ్రామం లేదా ఏరియా పేరు సెలెక్ట్ చేసుకోండి.
ల్యాండ్‌మార్క్ (Landmark): మీ ఇంటికి లేదా షాపుకు దగ్గరలో ఉన్న ఒక ప్రసిద్ధ గుర్తు (ఉదాహరణకు: పెద్ద స్కూల్, గుడి, లేదా బస్టాండ్) పేరు రాయండి.
4. ఫోటోలు మరియు వీడియోలు:
మంచి ఫోటోలు ఉంటే మీ ఆస్తి త్వరగా అద్దెకు/అమ్మకానికి వెళ్తుంది. కనీసం 3 నుండి 5 ఫోటోలు అప్‌లోడ్ చేయండి. మీ దగ్గర వీడియో ఉంటే ఆ లింక్ కూడా ఇవ్వండి.